calender_icon.png 22 July, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొద్దునిద్రలో టౌన్ ప్లానింగ్ సెక్షన్!

22-07-2025 12:00:00 AM

 - భారీగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు 

- అనుమతులు ఒకటి...నిర్మాణాలు మరోటి 

-  విచ్చలవిడిగా షెడ్లు, అనుమతి లేని కట్టడాలు 

- ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

- ఫిర్యాదులు చేసినా కదలని యంత్రాంగం 

- ఎల్బీనగర్ నియోజకవర్గంలో భారీగా 

- అక్రమ నిర్మాణాలు, వాణిజ్య సముదాయాలు 

ఎల్బీనగర్, జులై 12 : బల్దియా టౌన్ ప్లా నింగ్ అధికారుల తీరుపై ఇటీవల హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ’దేవుడైన మీ ఆ లోచనను పసిగట్టలేడు’ నిర్మాణం పూర్తయ్యేదాకా కండ్లు మూసుకుంటారా?.. అంటూ జీ హెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘దున్నపోతు మీద వాన చినుకు‘ అన్న చందంగా ఎల్బీనగర్ జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారు లు వ్యవహరిస్తున్నారు.  ఎల్బీనగర్ నియోజకవర్గంలో అనేక అక్రమ నిర్మాణాలు యధే చ్చగా కొనసాగుతున్నా... కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా అనుమతులు లేని భవనాలు, అపార్ట్ మెంట్లు, షెడ్ల నిర్మాణాలు పుట్టగొడుగుల మాదిరిగా వెలుస్తున్నాయి.

- అనుమతులు ఒకటి... నిర్మాణాలు మరోటి 

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్ సర్కిళ్ళ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణాల్లో అత్యధిక భాగం అనుమతులు తీసుకోకుండా చేపడుతు న్నారు. టీఎస్ బీపాస్‌లో ఒకరకమైన అనుమతులు తీసుకుని.. ఇతర నిర్మాణాలు చేపడుతున్నారు.రెసిడెన్షియల్ నిర్మాణ అనుమతులతో కమర్షియల్ కట్టడాలు నిర్మిస్తు న్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గా గండి పడుతుంది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులే ఎలాంటి చర్య లు తీసుకోవడం లేదు.

ల్బీనగర్ నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లా నింగ్ అధికారులు అ దనపు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఎల్బీనగర్ నియోజ కవర్గంలోని మూడు స ర్కిళ్లలో ఆయా డివిజన్లలో రెసిడెన్షియల్ అ నుమతులతో కమర్షియల్ నిర్మాణాలు జో రుగా సాగుతున్నాయి. అనుమతులు జీ + 2, 3, 4 వరకు తీసుకుని అదనపు అంతస్తు లు చేపడుతున్నారు. దీంతో పాటు నిబంధనలు పాటించ కుండా సెల్లార్ల నిర్మాణాలు జోరుగా సాగు తు న్నాయి. క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను గుర్తించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారు లు, చైన్ మన్లు, ఇతర సి బ్బంది కండ్లు మూ సుకొని చూస్తున్నారు. ఎవరైనా అక్రమ నిర్మాణాలపై సమాచారం లేదా ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా నో టీసులు ఇస్తున్నారు.

అదనపు ఆదాయం కోసం చర్యలు తీసుకోవడానికి ముందే ని ర్మాణాదారులకు సమాచారం ఇచ్చి, నిర్మాణాలను పూర్తి చేయిస్తున్నారు.  ఎల్బీనగర్ సర్కిల్-4 లోని చంపాపేట్ డివిజన్, బైరామల్ గూడలో, ఎ స్వీ కాలనీ రోడ్ నెంబర్ 3 లో జీ +2 అనుమతులు తీసుకొని ఐదు అంతస్తుల భారీ అక్రమ నిర్మాణం పూర్తి కావొస్తోంది.  సేట్ బ్యాక్ లేకుండా అనేక అక్రమ నిర్మాణ పను లు చకచకా కొనసాగుతున్నాయి. లింగోజిగూడ డివిజన్ లోని గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 13, సరూర్ నగర్ చెరువులోని ఎఫ్ టీ ఎల్ లో అధికారుల అండతో అక్రమ ని ర్మాణాలు కొనసాగుతున్నాయి.

హయత్ నగర్ సర్కిల్ -3 లోని హయత్ నగర్ సర్వేనెంబర్ 255లో ప్రభుత్వ భూమి కబ్జా చేశా రు.- బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ సాగర్ కాం ప్లెక్స్ శ్రీనగర్ కాలనీలో  హైవే రోడ్డును అనుకొని భారీ వాణిజ్య భవంతి  చేపడుతు న్నారు.. అనేక ఫిర్యాదుల అనంతరం అధికారులు సిబ్బంది చర్యలు తీసుకున్నారు.- ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ లోపల ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా  అండర్ గ్రౌం డ్ నిర్మాణంతో పాటు మల్టిపుల్ అదనపు అంతస్తులతో ఐరన్ స్ట్రక్చర్ వేసి భారీ నిర్మా ణం నిర్మిస్తున్నారు.- 

కొత్తపేట డివిజన్ పరిధిలో వాణిజ్య షెడ్ల నిర్మాణాలు విమర్శలకు తావిస్తున్నది. హస్తినాపురం డివిజన్ లో నిర్మాణదారులు భవన నిర్మాణ అనుమతులు తీసుకుని వాణిజ్య భవనాలు నిర్మిం చారు.  టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసిన అటు వైపు కన్నెత్తి చూడరు. గడ్డి అన్నారు డివిజన్ పటేల్ నగర్ లో అక్రమ కమర్శియ ల్ నిర్మాణం కొనసాగుతున్నది. సరూర్ నగ ర్ సర్కిల్ పరిధిలో  అక్రమ నిర్మాణాల కూ ల్చివేతలు జరగక  సంవత్సరం కాలం అవుతుందని స్థానికులు అంటున్నారు.- బీఎన్ రెడ్డి నగర్ డివిజన్  టీచర్స్ కాలనీ దర్జాగా ఆక్రమ భారీ వాణిజ్య నిర్మాణం కొనసాగుతున్నది.

సెల్లారుతోపాటు నాలు గు కమ ర్షియల్ ఫ్లోర్లు చేపడుతున్నారు. నాగోల్ డివిజన్ లోని రాక్ టౌన్ కాలనీలో కొనసాగు తున్న అక్రమ షెటర్ల నిర్మాణాలు చర్చనీయాంశంగా మారింది. రాక్ టౌన్ కాలనీలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రోడ్డు వెంట  దాదాపు 8 నుంచి 10షెటర్ల వరకు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి.  ఉప్పల్ నుం చి ఎల్బీనగర్ వచ్చే ప్రధాన రో డ్డుకు అనుకుని వరుసగా సెల్లార్లతో కూడిన అక్రమ ని ర్మాణాలు, భారీ షెడ్లు యథేచ్ఛగా సాగుతున్నాయి.

హయత్ నగర్ డివిజన్ సూర్యనగర్ కాలనీ ప్రధాన రోడ్డుకు ఆనుకు ని ఎలాంటి పర్మిష న్ లేకుండా అనేక షెట ర్లు నిర్మిస్తున్నారు. దీనిపై స్థానికులు టౌన్ ప్లానింగ్ అ ధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. నాగోల్, మ న్సూరాబాద్, హ యత్ నగర్ డివిజన్లలో ప్ర ధాన రోడ్ల వెంట, కాలనీల ముఖ్య కూడళ్లకు సమీపంలో కొం దరు యజమానులు యథేచ్చగా వ్యాపార కమర్షియల్ సెంటర్లు నిర్మి స్తున్నారు. నిర్మాణాలు చేపట్టి కమర్షియల్ షాపులకు కిరా యిలకు ఇచ్చి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు.

సర్కిల్ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు, సిబ్బంది తూతూ మంత్రంగా తనిఖీలు, నోటీసుల పేరుతో మ మా అనిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిర్మా ణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బల్దియా ఆదాయానికి లక్షల్లో గండిపడుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.