7 August, 2026 | 2:30 AM

నేడే జాతీయ ఓబీసీ మహాసభ

07-08-2026 12:00 AM
  1. బెంగళూరులో ఏర్పాట్లు పూర్తి
  2. హాజరుకానున్న కర్ణాటక సీఎం డీకే, కేంద్ర మంత్రులు, 
  3.   29 రాష్ట్రాల బీసీ ప్రతినిధులు: జాజుల శ్రీనివాస్‌గౌడ్ వెల్లడి

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా బీసీలను ఏకం చేయడానికి శుక్రవారం బెంగళూరులో నిర్వహించే జాతీయ ఓబీసీ మహాసభకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఏపీ అధ్యక్షుడు కేసిన శంకర్‌రావు, రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ మహారాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ పవన్‌రాజ్‌తైవాడే తెలిపారు.

బెంగళూరులోని సిటీ యూనివర్సిటీలో ఉన్న డాక్టర్ మన్మోహన్‌సింగ్ జ్ఞానజ్యోతి ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు జాతీయ మహాసభలు ప్రారంభమవుతాయని తెలిపారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడు హరిప్రసాద్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఓబీసీనేతలు పాల్గొంటారని వారు పేర్కొన్నారు.