calender_icon.png 22 May, 2025 | 12:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల బాధ తాళలేక యువకుడి ఆత్మహత్య

12-05-2025 02:37:36 AM

అప్పు తీర్చడానికి మరిన్ని అప్పులు 

ఎల్బీనగర్, మే 11 : అప్పుల బాధ తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు..  పైడిపల్లి సత్యనారాయణ రావు తన తమ్ముడు  జనార్దన్ రావు, అతడి భార్య పదేండ్ల క్రితం చనిపోయారు. కాగా, వీరికి  కొడుకు పైడిపల్లి అక్షిత్(26) ఉన్నాడు. అక్షిత్ ఉద్యోగ నిమిత్తం సొంత ఊరి నుంచి హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ఒక హోటల్లో రిసెప్షనిస్ట్ గా పని చేశాడు. పనిచేసే సమయంలో అక్షిత్ తన ఆర్థిక అవసరాల కోసం పలువురి వద్ద  అప్పు చేశాడు. 

ఈ క్రమంలో అక్షిత్ పని మానేసి మళ్లీ సొంతూరికి వెళ్లాడు. సంవత్సరం తర్వాత అప్పులు తీర్చడానికి ఉద్యోగం చేయాలని దిల్ సుఖ్ నగర్ కు వచ్చాడు. అప్పులు తీర్చాలని లోన్ యాప్స్ లో అప్పు తీసుకున్నాడు. అప్పుల బాధ అధికం కావడంతో ఈ నెల 11వ తేదీన రాత్రి రెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో తాను ఉంటున్న అజయ్ బాయ్స్ హాస్టల్ (హనుమాన్ నగర్) లో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్షిత్ ఆత్మహత్యపై ఎటువంటి అనుమానం లేదని పెద్దనాన్న సత్యనారాయణ రావు తెలిపారు. యువకుడి ఆత్మహత్యపై చైతన్యపురి పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు