18-07-2025 12:51:22 AM
కామారెడ్డి, జూలై 17 (విజయక్రాంతి), ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. గురు వారం సాయంత్రం కామారెడ్డి ప్రభుత్వ జన రల్ ఆస్పత్రిలో అభివృద్ధి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, ఆస్పత్రి అభివృద్ధి సలహా సంఘం కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వర్ అధ్యక్షతన నిర్వహించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ రోగులు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రదేశం ఇరుకుగా ఉన్నందున దీనికోసం ప్రత్యేకంగా ఒక షెడ్డు ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారు.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందిం చడానికి చేపట్టవలసిన చర్యలు కావలసిన వసతులు ఏర్పాటు గురించి చర్చించారు. ఆస్పత్రి అభివృద్ధి సలహా సంఘం నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేయాలని తలా కమిటీ సభ్యులు ,చైర్మన్ జిల్లా కలెక్టర్ అసిస్ సంగువాన్ ఆధ్వర్యంలో చర్చించారు