calender_icon.png 6 September, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోటా ఖాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో..

05-09-2025 01:57:14 AM

జాతీయస్థాయి కరాటే పోటీలు

ఉప్పల్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : ఈ నెల 14 సెప్టెంబర్ 2025 విక్టరీ చోటా ఖాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి కరాటే పోటీలు నిర్వహిస్తామన్నారు ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ పిసిసి అధ్యక్షులు, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు.

మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కరాటే రాను రాను అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా మన రాష్ట్ర క్రీడాకారులు ముందంజలో ఉన్నారని నేను రాష్ట్ర అధ్యక్షుడు గా గత పది సంవత్సరాల నుండి కరాటేని గుర్తింపు తెచ్చే విధంగా నేను ప్రయత్నిస్తున్నారన్నారు.

అనంతరం కరాటే మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలు పైగా మహేష్ కుమార్ గౌడ్ మన రాష్ట్ర అధ్యక్షులు కాకుండా జాతీ య స్థాయిలో కూడా ఉపాధ్యక్షులుగా ఉన్నారని, ఈ పోటీలు బొమ్మకు బాలయ్య గార్డెన్స్‌లో నిర్వహిస్తున్నామని ఈ పోటీలకు రాజకీయ నాయకులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు తోపాటు వివిధ రాష్ట్రాల నుండి జిల్లాల నుండి అఫీషియల్స్ విచ్చేసి ఈ టోర్నమెంట్‌ని పెద్ద ఎత్తున జరిపించేందుకు మా స్వయ శక్తుల కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ సదాశివుడు, శ్రీనివాస్ గౌడ్, ఎం వెంకటేష్, శ్రీనివాస్, కిరణ్ నాయక్, కొయ్యడ ప్రసాద్ గౌడ్, విగ్నేష్ జితేందర్ కరాటే మాస్టర్లు పాల్గొన్నారు.