calender_icon.png 5 September, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

05-09-2025 01:56:03 AM

-ప్రొఫెసర్ జీ. హరగోపాల్

ముషీరాబాద్, సెప్టెంబర్ 4(విజయక్రాంతి): తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. దేశ పౌరులందరికీ రాజ్యాం గం ఇచ్చిన జీవించే హక్కును కాపాడటానికి కాల్పుల విరమణ ప్రకటించే దిశగా కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్‌క్లబ్‌లో పూర్వ విప్లవ విద్యార్థి వేదిక తెలంగాణ,  ఆంధ్ర ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ హాజ రై మాట్లాడారు. యుద్ధం మానవాళిని భయపెడుతున్నదని,  స్వేచ్ఛ జీవులైన మానవులను ఆందోళనకు గురిచేస్తుందన్నా రు. 

పాలాస్తీనాలో,  ఉక్రెయిన్‌లో, మధ్య భారతదేశంలో ప్రజల ఉనికిని పాలకులు ప్రశ్నార్థకంగా చేస్తున్నారని ఆరోపిం చారు.  2026 మార్చ్ నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే ప్రకటించడం సరైంది కాదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 భారత భూభాగంలో ప్రజలందరి ప్రాణాలకు రక్షణ ఇచ్చిందని, చట్ట ప్రకారం నేర విచారణ జరిగి తగిన ఆధారాలు ఉంటే న్యాయస్థానం మాత్రమే పౌరులకు శిక్ష విధిం చాలని, కానీ ప్రభుత్వం ఏకపక్షంగా పెద్ద ఎత్తున సైనిక, అర్థ సైనిక బలగాలను, పోలీసులకు మోహరించి మధ్య భారత దేశంలో ఆదివాసులను హత్య చేస్తున్నదని ఆయన మండిపడ్డారు.  ఈ సంతకాల సేకరణ కాపీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవే స్తామని పేర్కొన్నారు.

తక్షణ మే తెలంగాణలో  కాల్పుల విరమణ ప్రకటించి మావో యిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పూర్వ విప్లవ విద్యార్థి వేదిక ప్రతిని ధులు నాగయ్య, ఏకే ప్రభాకర్, మల్కోటి, చరణ్ తదితరులు పాల్గొన్నారు.