calender_icon.png 15 September, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్ ఏమైనా నిషేధిత ప్రాంతమా?

15-09-2025 12:00:00 AM

రాష్ట్రంలో బీఆర్‌ఎస్ లేకుండా కుట్ర: మాజీ మంత్రి రామన్న

ఆదిలాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాం తి): ఆదిలాబాద్ కలెక్టరేట్ ఏమైనా నిషేధిత ప్రాంతమా..? అని మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ లేకుండా చేసేందుకు కుట్ర పన్ను తున్న కాంగ్రెస్ ప్రభుత్వంకు అది సాధ్యం కాదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న స్పష్టం చేశారు. కూలిన కలెక్టరేట్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తమ బీఆర్‌ఎస్ నేతలపై కేసు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను పార్టీ శ్రేణుల తో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ... ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ వెళ్లి కూలిన కలెక్టరేట్ ప్రాంతాన్ని చూస్తే వారికి నిషేధిత ప్రాంతం కదా అని ప్రశ్నించారు. అధికార కాంగ్రెస్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీపై కుట్ర పన్నుతున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రూ.55 కోట్లతో ప్రారంభించిన సమీకృత కలెక్టరేట్ భవనానికి, ప్రస్తుత కాం గ్రెస్ ప్రభుత్వం హయాంలో నిధులు కేటాయించకపోవడంతోనే నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయ న్నారు. పనుల జాప్యానికి ప్రభుత్వ అసమర్థతే కారణమని మండిపడ్డారు. వెంటనే కలెక్టరేట్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాం డ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నారాయణ,  గండ్రత్ రమేష్, పవన్ నాయక్, మర్శేట్టి గోవర్ధన్, యూనుస్ అక్బని, కానక రమణ, తదితరులు పాల్గొన్నారు.