calender_icon.png 31 August, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎల్‌బిసి కాలువకు మరమ్మత్తులు చేపట్టండి

30-08-2025 06:25:00 PM

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల

నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలోని పన్నాల గూడెంలో నారాయణ పాఠశాల వెనుక ఉన్న ఎస్ఎల్బీసీ మురికి కాలువకు మరమ్మత్తులు చేపట్టాలని సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల(CPM District Secretariat Member Kandala Pramila) డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని 9, 10 వార్డులలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజలు సమస్యలను సర్వే బృందంకు విన్నవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎస్ఎల్బిసి మురికి కాలువలో కంప చెట్లు పెరిగి వర్షాలు పడినప్పుడు వరద నీరు సాఫీగా ప్రవహించకపోవడంతో వర్షం నీరు, మురికి నీరు కలిసి ఇళ్లలోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కావున వెంటనే అధికారులు స్పందించి కాలువకు మరమ్మత్తులు చేపట్టాలన్నారు. మార్కెట్ రోడ్ లోని పైపుల కంపెనీ సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంప చెట్లు పెరిగి ప్రమాదకరంగా మారిందన్నారు. విద్యుత్ అధికారులు స్పందించి పెరిగిన కంపచెట్లను తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ కార్యదర్శి వంటిపాక వెంకటేశ్వర్లు, ఏరియా కార్యదర్శి చెన్నబోయిన నాగమణి, నాయకులు ఒంటెపాక కృష్ణ, సాకుంట్ల నరసింహ, గింజల లక్ష్మి, గురుజ స్వరూప, ఏర్పుల రాజేశ్వర్, పన్నాల శశికళ, ఆర్. ఇందిర, జయమ్మ, సాగర్ రెడ్డి పాల్గొన్నారు.