30-08-2025 06:25:25 PM
యువజన విభాగం కార్యనిర్వహక అధ్యక్షుడి ఎన్నిక
బెజ్జంకి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. శనివారం భారత రాష్ట్ర సమితి యువజన విభాగం కార్యనిర్వహక అధ్యక్షుడిగా రామంచ పర్షరామ్ నియామకం చేసి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ... కాంగ్రెస్ వైఫల్యాలను గడపగడపకూ వివరించాలని, బీఆర్‌ఎస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు.
దొంగ హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధే తప్పా.. ఏ ఒక నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభివృద్ధి చేయలేదు అన్నారు. నూతనంగా నియామకం అయిన పర్షరాములు ను అభినందించి.పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.