calender_icon.png 19 November, 2025 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెరవేరని వన మహోత్సవం లక్ష్యం

19-11-2025 12:00:00 AM

మొక్కలపై అధికారుల నిర్లక్ష్యం ప్రజాధనం దుర్వినియోగం 

భీమిని, నవంబర్ 18 : వన మహోత్సవం మొక్కలపై అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతుంది. ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చుపెట్టి పర్యావరణ పరిరక్షణ పెంపొందించేందుకు చేపట్టిన వన మహోత్సవం  నీరుగారుతోంది.  మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకున్న ఘటన ఇది. ఒకవైపు పచ్చదనం పెంపొందించాలని ప్రభుత్వం కోట్ల రూపాయలు వేచ్చిస్తుం టే క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం ఆ ప్రయత్నానికి నీరుగారుస్తుంది.

భీమిని మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనుక వైపు భాగములో గుంతలు తోడి మొక్కలు నాటకపోవడంతో మొక్కలు ఎండిపోయి దర్శనమి స్తున్నాయి. ప్రభుత్వ అధికారుల సమన్వయ లోపం ముందు చూపు లేకపోవడంతో  మొక్క లు ఎండిపోయి కనిపిస్తున్నాయి. దీంతో వనమహోత్సవం లక్ష్యం నెరవేరడం లేదు. కాగితా ల లెక్కలకే మొక్కలు పరిమితమయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

మొక్కలు నాటి నిర్వహణ చేయాల్సిన అధికారులు గాలికి వదిలి వేయడంతో మొక్కలు ఎండిపోయి దర్శనమిస్తుండడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కలను నాటి సంరక్షించాల్సిన అధి కారులు బాధ్యత మరవడంపై అర్థం కావడం లేదు. ఎండిపోతున్న మొక్కలపై అధికారులు ఎంత నీర్లక్యంగా వ్యవహరిస్తున్నరో తేటతెల్లమవుతుంది. మండల వాసులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

కొరవడిన పర్యవేక్షణ 

మండలంలో వన మహోత్సవం మొక్కలు నాటి సంరక్షించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్ర విమర్శలకు తావిస్తోంది.  ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరబడిందని తెలుస్తోంది. కార్యక్రమాలకే అధికారులు పరిమితమయినట్లు కనిపిస్తుంది.