19-11-2025 12:00:00 AM
100 ప్రథమ చికిత్స కిట్లను క్లబ్ సభ్యులకు అందజేత
ఆదిలాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి) : జిల్లా వ్యాప్తంగా 30% ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా జిల్లాలో మొట్టమొదటి సారిగా రోడ్ సేఫ్టీ క్లబ్ అనే కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. మం గళవారం గుడిహత్నూర్ మండలం మన్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీ కాజల్ సింగ్ తో కలిసి ఎస్పీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోడ్డు ప్రమా దం జరిగిన స్థలంలో చేయల్సిన చర్యలపై, క్షతగాత్రునికి హృదయ స్పందన ఊపిరి లేని సందర్భంలో సిపిఆర్ చేసి బ్రతికించే శిక్షణ పై అవగాహన కల్పించారు. ఈ మేరకు ఎస్పీ మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా ఉన్న జాతీ య రహదారులు, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న గ్రామాల ప్రజలు, రహదారుల వెంట ఉన్న దాబా యజమానులు, పనివారు, పెట్రో ల్ బంక్ వారు, వాహన టైర్ల రిపేరు ప్రజలు, టీ స్టాల్ వ్యక్తులు ఈ రోడ్ సేఫ్టీ క్లబ్ లో సభ్యులుగా కొనసాగుతారనీ ఎస్పీ తెలిపారు.
ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 450 గ్రామాల లో ప్రతి గ్రామం నుండి చురుకుగా పనిచేసే యువకులు వ్యక్తులు ఐదుగురు చొప్పున రోడ్ సేఫ్టీ క్లబ్ లో సభ్యులుగా ఉన్నారనీ, వీరి ముఖ్య కర్తవ్యం గ్రామాలలో రోడ్డు ప్రమాదా లు జరగకుండా వాహన నియమ నిబంధన లు పాటించేలా రోడ్డు నిబంధనలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అన్నారు.
గ్రామాలలో ఎక్కువగా ప్రమాదా లు జరిగే స్థలాన్ని గుర్తించి, ప్రమాదాల నివారణకు చేయవలసిన చర్యలు స్పీడ్ బ్రేకర్లు, రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్లను తీసివేయడం, సూచిక బోర్డులను ఏర్పాటు లాంటి వాటిని అధికారుల దృష్టికి తీసుకురావడం వారి కర్త వ్యం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి జీవన్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, కరీంనగర్ రేణే హాస్పిటల్, మం చిర్యాల మెడి లైఫ్ హాస్పిటల్ సిబ్బంది, సిఐలు బండారి రాజు, కర్ర స్వామి, గురు స్వామి, ప్రసాద్, శ్రావణ్, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్‌ఐలు, ముఖ్యంగా రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులు, ప్రజలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.