17-11-2025 01:00:30 AM
-కాంగ్రెస్ ఎంపీ చామల
హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి) : హిందువులు ఏ పార్టీలో ఉన్నా బీజేపీలో చేరాలని కేంద్ర మంత్రి బండి సం జయ్ పిలుపునివ్వడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బండి సంజయ్ తన హోదాను మర్చిపోయి మాట్లాడటం అలవాటుగా మారిందనివిమర్శించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్న సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జరిగితే బీజేపీ డిపాజిట్ గల్లంతయిందని ఆదివారం ప్రకటనలో తెలిపారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, సంజయ్ మాటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం లేదని, ఎవ రికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసన్నారు.