17-11-2025 01:00:54 AM
ఈజీ మనీ కోసం..అప్పుల పాలు
ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చేరుతున్న వైనం
అవగాహన లేకనే అంటున్న విశ్లేషకులు
బూర్గంపాడు,నవంబర్16,(విజయక్రాంతి): ఆన్లైన్ గేమ్స్ తో ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. సామాన్య, మధ్యతరగతి, ధనిక వర్గాలకు చెందిన యువతతో పాటు మధ్య వయస్సు కలిగిన వారు కూడా ఆన్ లైన్ ఉచ్చులో పడుతున్నారు. కష్టపడకుండా డబ్బులు సంపాధించాలనే ఆలోచన తో ఆన్లైన్ క్రీడల్లో పాల్గొంటున్నారు. తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ పొందాలనే ఆశతో ఆన్ లైన్ జూదం వైపు మరలతూ చివరకు అప్పులపాలై క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడుతున్న పరిస్థితి. దీంతో ఆ కు టుంబాలు కన్నీటి సముద్రంలో మునుగుతున్నాయి.
నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వినిపిస్తున్నారు. ఈ ఫోన్ల కారణంగానే పిల్లలు ఆరోగ్యపరంగా ఇబ్బం దులు పడుతుంటే, యువకులు ఆపై పడినవారు పెడదారి పడుతున్నారు. ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అన్లైన్ లో అనేక క్రీడలకు సంబంధించిన బెట్టింగులకు పాల్పడటం, రుణాలు తీసుకోవడం, ఆఫర్ల పేరు తో మోసపోతూ దిక్కుతోచని స్థితికి చేరుకుంటున్నారు.
ఇందులో ప్రధానంగా ఆన్ లైన్ బెట్టింగ్, లూడో, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తో పాటు అనేక ఆన్ లైన్ గేమ్స్ ఆడి అ ప్పుల ఊబిలో కూరుకపోతున్నారు. కొంతమంది తెలుసుకొని వీటికి దూరమవుతుంటే చాలామంది తమ ఆస్తులను విక్రయించుకునే పరిస్థితికి దిగజారుతున్నారు. తల్లిదం డ్రులకు తెలియకుండా వాహనాలు, బంగా రు అభరణాలు కూడా తనకా పెట్టి జూదం ఆడుతున్నారు. మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్ లకు బానిసై భార్యను సైతం కడ తేడ్చాడు.
అవగాహన లేక అవస్థలు..
ఎక్కువ శాతం యువత నిత్యం స్మార్ట్ ఫోన్తో గడిపేస్తున్నారు. ఈ క్రమంలో ఆన్ లైన్ గేమ్స్ బారిన పడుతున్నారు. ఫలితంగా ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. కాగా యువత అవగాహ న లేకపోవడంతోనే ఆన్ లైన్ గేమ్స్ ఆడి ప్రాణాలు పైకి తెచ్చుకుంటున్నారని విశ్లేషకుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈజీ మనీ కోసం ఆశపడుతూ అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం, అధికారులు, పోలీస్ యంత్రాంగం ఎప్పకప్పుడు అవగాహన కల్పిస్తున్నా.. మార్పు మాత్రం రావడం లేదు.
ఆన్లైన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఆన్లైన్ ఆటల పై,లోన్ ఆప్స్ వాటిలో జరుగుతున్న మోసా ల పట్ల మండలం మరియు పరిసర ప్రాంత గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆన్లైన్ మోసాల పట్ల ఖచ్చితంగా యువత అవగాహన కలిగి ఉండాలి. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు ఏం చేస్తున్నారని గమని స్తూ ఉండాలి. పిల్లల కదలికలపై ఓ కన్నేసి ఉండాలి.
ఎస్‌ఐ మేడ ప్రసాద్,బూర్గంపాడు