calender_icon.png 17 November, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెట్ దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యలు

17-11-2025 12:59:19 AM

హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. టెట్ రాసేందుకు నిరుద్యోగులు, టెట్ అర్హతలేని ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈనెల 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ఆదివారం టెట్ దరఖాస్తుల్లో స్వల్ప సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పలువురు అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం ఓ అభ్యర్థి దరఖాస్తు చేసే క్రమంలో గతంలో రాసిన టెట్ హాల్‌టికెట్ నంబర్ నమోదు చేసిన తర్వాత ఇన్‌వ్యాలిడ్ హాల్‌టికెట్ అని వచ్చినట్లు తెలిపారు. 2023 టెట్ రాసిన వారి వివరాలను మాత్రమే వెబ్‌సైట్ తీసుకుంటుంది.

2024, 2025 వివరాలు తీసుకోవడంలేదని ఆ అభ్యర్థి తెలిపారు. టెట్ ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్‌మిట్ చేసేందుకు జర్నల్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడీతో సబ్‌మిట్ చేస్తుంటే గివెన్ పేమెంట్ ఐడీ రాంగ్ అని వస్తుందని మరో అభ్యర్థి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే టెట్ దరఖాస్తుల్లో ఎటువంటి సమస్య తలెత్తినా అభ్యర్థులు హెల్ప్ డెస్క్ ఫోన్ చేసేలా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. 

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి: ఆర్‌యూపీపీటీ డిమాండ్

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష ) నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ (ఆర్‌యూపీపీటీ) రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా, ప్రధానకార్యదర్శి గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ కోరారు.

హైదరాబాద్ నాంపల్లిలోని హిందీ ప్రచారసభ కార్యాలయంలో సంఘం రాష్ట్ర కా ర్యవర్గ సమావేశం నిర్వహించినట్లు ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఒకవేళ టెట్ తప్పనిసరైతే భాషోపాధ్యాయులకు ప్రత్యేకంగా టెట్ పేపర్ నిర్వహించాలని కో రారు. జీవో 317 ద్వారా నష్టపోయి న భాషోపాధ్యాయులకు అంతర్‌జి ల్లా బదిలీలు చేపట్టాలని కోరారు.  సమావేశంలో నాయకులు ఎస్.లక్ష్మీనారాయణ, ఎన్.భిక్షపతి, లక్ష్మణ్ గౌ డ్, పద్మజారాణి పాల్గొన్నారు.