31-10-2025 11:39:42 PM
మరిపెడ పరిష్క క్రీస్తు రాజు చర్చి పాస్టర్ సురేష్, సిస్టర్స్
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో నెలను పవిత్ర జపమాల తల్లి మరియమ్మకు అంకితం చేసిన పవిత్రమైన నెలగా కేథలిక్ చర్చి భావిస్తుందనీ, మరియమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని మరిపెడ పరిష్క క్రీస్తు రాజు చర్చి పాస్టర్ సురేష్, సిస్టర్స్ అన్నారు. శుక్రవారం మరిపెడ మండలంలో పరీష్ క్రీస్తు రాజు చర్చి పరిష్ విశ్వాసులు ప్రతి కుటుంబంలో జపమాల ప్రార్థనలు భక్తిపూర్వకంగా నిర్వహించారు. చివరి రోజు క్రీస్తు రాజు చర్చి నుండి కర్గిల్ వరకు ఘనమైన మాలాప్రసెషన్ నిర్వహించి, తిరిగి చర్చి వద్దకు చేరుకున్నారు.
అనంతరం ఫా. సురేష్ గారు, సిస్టర్స్ మరియు చర్చి పెద్దల సాన్నిధ్యంలో పవిత్ర మాస్ నిర్వహించారు. అక్టోబర్ నెలలో విశ్వాసులు జపమాలను ప్రార్థిస్తూ, మరియమ్మ ద్వారా దేవుని ఆశీర్వాదాలను కోరుకుంటారన్నారు. జపమాల ప్రార్థన మనకు యేసు క్రీస్తు జీవితం, మరణం, పునరుత్థానం గురించి ధ్యానం చేసే అవకాశం ఇస్తుందనీ, తల్లి మరియమ్మ దేవుని కృపకు ద్వారం లాంటిదన్నారు. ఆమె తన ప్రేమతో మనలను యేసు వైపు నడిపిస్తుందనీ, అక్టోబర్ నెలలో కుటుంబాలు కలసి జపమాలను ప్రార్థించడం ద్వారా ఐక్యత, శాంతి, ప్రేమను పొందుతాయన్నారు. మరియమ్మ వినమ్రత, విశ్వాసం, విధేయత మనకు ఆదర్శంగా నిలుస్తాయనీ, ఆమె మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని అంగీకరించడానికి ప్రేరణ ఇస్తుందన్నారు.
జపమాల ప్రార్థన మన హృదయాన్ని శాంతితో నింపుతుందనీ, ఈ నెలలో చర్చిలలో ప్రత్యేక మరియమ్మ ఉత్సవాలు, ప్రార్థనలు నిర్వహిస్తారనీ, మరియమ్మ ఆశీస్సులతో అనేకులు అద్భుతాలను అనుభవించారనీ గుర్తుచేశారు. ఆమె మన రక్షణకై ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటుందనీ, అక్టోబర్ నెల మనకు తల్లి మరియమ్మ ప్రేమను మరింతగా అనుభవించే పవిత్ర సమయమని, ఆమె మార్గదర్శకత్వంలో మన జీవితం దేవుని కృపతో నిండిపోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది విశ్వాసులు భక్తిపూర్వకంగా పాల్గొన్నారు.