30-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 29 : టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దేశవాళీ క్రికెట్‌లో ఫామ్ అందుకున్నాడు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ డి మ్యాచ్‌లో ఛత్తీస్‌ఘడ్‌పై అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశాడు. జింఖానా గ్రౌం డ్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో సిరాజ్ దెబ్బ కు ఛత్తీస్‌ఘడ్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. సీటీఎల్ రక్ష ణ్ కూడా రాణించడంతో ఛత్తీస్‌ఘడ్ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులు ఆలౌటైంది.
సిరాజ్ (4/56) కీలక వికెట్లు తీసి ఛత్తీస్‌ఘడ్ జోరుకు బ్రేక్ వేశాడు. ప్రతీక్ సెంచరీ చేయ గా, వికల్ఫ్ హాఫ్ సెంచరీతో రాణించారు. సి రాజ్ బౌలింగ్ కారణంగానే ఛత్తీస్‌ఘడ్ 300 పరుగుల లోపే ఆలౌ టైంది. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ తొలిరోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. హైదరాబాద్ ఇంకా 227 పరుగులు వెనుకబడి ఉంది.