26-07-2025 12:00:00 AM
బెజ్జూర్, జూలై 25(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ అ ధికారి కార్యాలయంకు వెళ్లాలంటే నీటి లో దిగాల్సిందే. మండల కేంద్రంలో గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన రహదారికి ఇరువైపులా మురికి కాలువలు లేకపోవడం తో కార్యాలయం ప్రాంగణంలోకి వర్ష పు నీరు చేరి చెరువుల తలపిస్తుంది. వివిధ పనులపై కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
సిబ్బంది సైతం నీటిలో నడుచుకుంటూ కార్యాలయానికి వెళ్లలసిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. వర్షపు నీరు ఇలానే నిలిచి ఉన్నట్లయితే దోమలు విపరీతంగా పెరిగి విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని చుట్టుపక్కలవారు బయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిలిచిన నీటిని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.