01-11-2025 12:19:54 AM
- లబ్దిదారులకు మరింత ఊరట
- రూ.12వేలు ఇవ్వనున్న ఎస్బీఎం
- ఇరుకు స్థలమున్న పట్టణవాసులకు జీ+1 తరహా నిర్మాణాలకు అవకాశం
సంగారెడ్డి, అక్టోబర్ 31(విజయక్రాంతి): నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఇళ్లు ని ర్మించుకునే లబ్దిదారులకు నాలుగు విడతల్లో రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందజే స్తోంది. లబ్దిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయడం, మేస్త్రీలు, నిర్మాణ కూలీల కొరత లేకుండా శ్రద్ధ వహిస్తోంది. తాజాగా వారికి మరింత ప్రయోజనం చేకూర్చేలా వ్య క్తిగత మరుగు దొడ్లు మంజూరు చేయాలని నిర్ణయించింది.
స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం) ద్వారా రూ.12వేల ఆర్థిక సాయాన్ని అందించేలా ఉత్తర్వులు జారీ చేసింది. స్లాబ్ లెవెల్, స్లాబ్ నిర్మాణం పూర్తి చేసిన ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన లబ్దిదారులకే ఈ సాయం అందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు అర్హుల ఎంపికపై దృష్టి సారించారు. ఈ మేరకు లబ్దిదారుల వివరాలను ఎస్బీఎం అధికారులకు అందజేస్తు న్నా రు. ఆ వివరాలను పరిశీలిస్తున్న సదరు అధికారులు మరుగుదొడ్ల నిర్మాణాల అంచనా లను సిద్ధం చేసి నగదును లబ్దిదారుల ఖా తాల్లో జమ చేసేలా చర్యలు చేపడుతున్నా రు. ఈ నిర్ణయంతో జిల్లాలో ఇందిరమ్మ లబ్దిదారులకు తొలి విడతగా ప్రయోజనం చేకూరనుంది.
పట్టణ పేదలకు మరింత లబ్ధి...
పట్టణాల్లో 400 చదరపు అడుగులలోపు స్థలం కలిగిన పేదలూ జీ ప్లస్ వన్ విధానంలో నిర్మించుకునేలా ఇళ్లు మంజూరు చే యాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 500 నుంచి 600 చ దరపు అడుగుల సొంత స్థలాన్ని కలిగిన పేదలకు మాత్రమే ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఇప్పటివరకు ఆ దిశగానే అమలు చేసింది. ఈ విధానంలో రెండు గ దులతో పాటు వంటగది మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాలని స్పష్టం చేసింది.
ఇంటి నిర్మాణ డిజైను హౌసింగ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు అనుమతి తప్పనిసరి చేసింది. అయితే గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణానికి రూ.లక్ష, రూఫ్ లెవెల్ కు రూ.లక్ష, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణానికి రూ.రెండు లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సంచాలకుడు గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా లబ్దిదారుల ఎంపికపై మున్సిపల్, హౌసింగ్ శాఖల అధికారులు దృష్టి సారించారు. త్వరలోనే అర్హులను ఎంపిక చేసి ఇళ్లు మంజూరు చేయనున్నారు.
అంచనాలు సిద్ధం చేస్తున్నాం...
ఇందిరమ్మ లబ్ధిదారులకు వ్యక్తిగత మరుగు దొడ్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అం దాయి. ఇప్పటివరకు సంగారెడ్డి జిల్లాలో 875 మంది లబ్ధిదారుల వివరాలను హౌసిం గ్ శాఖ అధికారులు మాకు పం పించారు. జాబ్ కార్డు కలిగిన ఇందిరమ్మ లబ్ధిదారుల మరుగుదొడ్డికి సం బంధించి ఎస్టిమేషన్లు సిద్ధం చేస్తున్నాం. ప్రక్రియ పూర్తయ్యాక వారి ఖాతాల్లో రూ.12 వేలుజమచేస్తాం.
స్వామి, ఎస్బీఎం కో ఆర్డినేటర్, సంగారెడ్డి