21 August, 2026 | 2:48 AM

విద్య, వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట: మంత్రి పొంగులేటి

21-08-2026 01:09 AM

రూ.1.83 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

రూ.40 లక్షలతో కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన, రూ.1.43 కోట్లతో అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభం

సత్తుపల్లి, ఖమ్మం, (విజయక్రాంతి): ప్రజారోగ్యం, విద్యారంగాల బలోపేతానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యమి స్తోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ. 1.83 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... పట్టణ పేదలకు నాణ్యమైన ఉచిత ప్రాథమిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఎన్టీఆర్ నగర్లో రూ. 1.43 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. అలాగే శివసాయి నగర్లో రూ. 40 లక్షల నిధులతో నిర్మించనున్న మల్టీపర్పస్ మున్సిపల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజల సామాజిక కార్యకలాపాలకు, శుభకార్యాలకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.  స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.