21 August, 2026 | 2:46 AM

కేవైసీ మోసాలతో అప్రమత్తంగా ఉండాలి

21-08-2026 01:43 AM

సీఐ వెంకటరెడ్డి

కంగ్టి, ఆగస్టు 20: కేవైసీ పేరుతో వచ్చే అనుమానాస్పద సందేశాలు లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సీఐ వెంకటరెడ్డి సూచించారు. కేవైసీ అప్డేట్ చేయకపోతే బ్యాంకు ఖాతాను లిపివేస్తాం అంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దన్నారు. తెలియని లింకులపై క్లిక్. చేయకూడదని, ఓటీపీ, పిన్, పాస్వర్డ్ వంటి రహస్య వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. అనుమానం ఉంటే నేరుగా సంబంధిత బ్యాంకును సంప్రదించాలని సూచించారు.