03-09-2025 07:38:04 PM
ఎమ్మెల్సీ శంకర్ నాయక్
హుజూర్ నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద వర్గాల పిల్లలను చదువు ద్వారా గొప్ప వారిని చేసిన మహనీయుడు గోవిందు నాయక్ అని ఎమ్మెల్సీ శంకర్ నాయక్(MLC Shankar Naik), ఎస్టియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద గౌడ్ అన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టియు ఆధ్వర్యంలో పట్టణంలో కౌండిన్య ఫంక్షన్ హాల్ లో తాళ్ల మల్కాపురం ప్రధానోపాధ్యాయులు గోవింద నాయక్ సంతాప సభలో వారు పాల్గొని మాట్లాడారు. మారుమూల తండాలోని పేద కుటుంబంలో జన్మించిన గోవింద నాయక్ గొప్ప ఉపాధ్యాయునిగా ఎదిగి ఆదర్శప్రాయుడుగా నిలిచారని వారు కొనియాడారు. అనంతరం గణిత ఉపాధ్యాయుల ఫోరం సూర్యపేట జిల్లా ప్రతినిధులు గోవింద నాయక్ కుటుంబానికి 63 వేల రూపాయల చెక్కు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టియు ఉపాధ్యక్షుడు కేవి సత్య నారాయణ,జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి నాగేశ్వరరావు,గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకుడు ధరావత్ మోతిలాల్, మండల విద్యాధికారులు చత్రునాయక్, సైదా నాయక్,కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు సువర్ణ, నాగమణి, వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.