30-06-2025 11:32:52 PM
రాష్ట్రస్థాయి కవులు, కళకారుల సదస్సులో పలువురు వ్యక్తలు..
ముషీరాబాద్ (విజయక్రాంతి): మనిషి జీవన విధానం, ఆలోచనలు, ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు, మతం, సంప్రదాయాలు కళా సాహిత్యాలు, భాషా అన్ని అంశాల సమగ్ర స్వరూపమే సంస్కృతి అని, దీనిని చాటి చెప్పేందుకు సమగ్ర సాంస్కృతికి పాలసీని ప్రభుత్వం ప్రకటించాలని పలువురు వ్యక్తలు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్(Basheerbagh Press Club)లో సమగ్ర సాంస్కృతిక విధానం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రస్థాయి కవులు, కళకారుల సదస్సును నిర్వహించారు.
తెలంగాణ ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కె.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao), ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, ఇప్టా సీనియర్ నాయకులు కందిమళ్ల ప్రతాపరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస రావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, కలవేణి శంకర్, ఇటి నరసింహా, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ్మా, ఉపాధ్యక్షులు ఉప్పలయ్య, లక్ష్మీనారాయణ, అరసం కార్యదర్శి రాపోలు సుదర్శన్, నేతలు కెవిఎల్, నళిని, కాంగ్రెస్ సాంస్కృతిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు చక్రల రఘు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ... సమాజం మరింత వెలుగు రేఖల వైపు తీసుకువెళ్లడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజన్యాటమండలి పని చేయాలన్నారు. సమాజంలో జరగుతున్న పరిణామ రూపానికి ప్రతి రూపం మన సంస్కృతి అన్ని ఆలాంటి సాంస్కతి సమగ్ర విధానాన్ని ఉండాలని కార్లర్ మార్క్, లెనిన్ కాలంలో నుంచే పోరాటం కొనసాగుతోందని, దానిని కొనసాగింపుగా తెలంగాణ ప్రజానాట్యమండలి ముందుకు తీసుకువెళ్లుతోందన్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ... భావ వ్యాప్తిలో సాంస్కృతిక రంగానిదే కీలక పాత్ర అన్నారు. ప్రజలను జాగృతి చేయడంలో ప్రజానాట్య మండలి నాటి నుంచి కీలక పాత్ర పోషించిందని, దానిని ఆదేవిధంగా కొనసాగించాలని సూచించారు. కళాకారుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి అందజేయనున్నట్లు పల్లె నర్సింహ తెలిపారు.