15 April, 2026 | 12:06 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

క్వారీలు, గుట్టలపై వడ్డెరలకు పూర్తి హక్కులు కల్పించాలి

16-06-2025 12:21 AM

- వడ్డెర వృత్తిదారులకు ఆధునిక పనిముట్లు ఇవ్వాలి   

- వడ్డెర వృత్తి దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లపు విఘ్నేశ్

వనపర్తి టౌన్, జూన్ 15 : వడ్డెర వృత్తిదారుల సమస్యలను పరిష్కరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని క్వారీలపై, గుట్టలపై వడ్డెరలకి పూర్తి హక్కులు కల్పించా లని వడ్డెర వృత్తి దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లపు విఘ్నేశ్ అన్నారు. ఆదివారం వనపర్తి కేంద్రంలో ని యాదవ సంఘం లో వనపర్తి జిల్లా సధస్సు కార్యక్రమం ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు.

దేశాన్నికి స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న వడ్డెర వృత్తిదారుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ప్రపంచీకరణ భాగంగా గుట్టలపై, క్వారీలు పూర్తిగా ప్రవేట్ వ్యక్తుల చేతులలోకి వేల్లిన్నాయని దీని వల్ల వడ్డెర వృత్తిదారుల జీవితాలపై పెను ప్రభావం చూపాయని అన్నారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి ఫింఛన్లు ఇవ్వాలని, వడ్డెర వృత్తిదారుల రాష్ట్రంలో 4 వేల సోసైటీల ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడ ఋణాలు మంజూరు చేయలేదని కనీ సం ఫేడరేషన్ కు చైర్మన్ కూడ నియమించలేదని అన్నారు.

వడ్డెర వృత్తిదారులకు భీమా సౌకర్యం కల్పీంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సదస్సులో వివిధ గ్రామాల నుంచి వచ్చిన వడ్డెర వృత్తి కార్మికులు మరియు చేతి వృత్తి దారుల జిల్లా సమన్వయ నాయకులు ఆంజనేయులు నాగర్ కర్నూలు జిల్లా వడ్డెర వృత్తిదారుల కార్యదర్శి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరము వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షులుగా ఉదయరాజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈ కురుమ య్య మరి జిల్లా కమిటీ సభ్యులు 9 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.