31-10-2025 11:11:32 PM
సామాజిక పరిశుభ్రతపై అవగాహన
మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా,బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు 4 వ డివిజన్ యందు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించడం జరిగినది. కమిషనర్ శైలజ మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్యక్రమాలు అంటే నీటి సరఫరా, పారిశుధ్యం, పరిశుభ్రతను మెరుగుపరచడం కోసం చేసే వివిధ కార్యకలాపాలు. వీటిలో డ్రైనేజీ నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, వ్యక్తిగత మరియు సామాజిక పరిశుభ్రతపై అవగాహన కల్పించడం వంటివి ఉంటాయి. వర్షకాలం వంటి వ్యాధులు ప్రబలే సమయాల్లో గ్రామాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని,ఇంటి ఆవరణంలో పరిశుభ్రంగా ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేనియెడల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలిపారు.