23-07-2024 12:29:13 AM
హనుమకొండ, జూలై 22 (విజయక్రాంతి): తెలంగాణలోనే మొట్ట మొదటిసారిగా బంగారం కొనుగోలు చేసే మొబైల్ ఆఫీస్ వాహనాన్ని వరంగల్‌లో వాల్యూగోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆది వారం ప్రారంభించింది. తమ ఆర్థిక అవసరాలకు బంగారాన్ని విక్రయించి డబ్బు పొందాలను కుం టున్న ప్రజలకు సంస్థ సులభతరంచేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, సికింద్రాబాద్, ఉప్పల్, కూకట్ పల్లి, చింతల్‌లో సంస్థ స్టోర్లు ఉన్నాయి. గ్రామాల్లో కూడా కస్టమర్లకు సేవలందించడానికి సంస్థ సన్నద్ధం అయ్యింది. బంగారం నాణ్యత పరీక్షించి, తక్షణమే డబ్బును పొందవచ్చని సంస్థ సీఈవో భరద్వాజ్ పంపత్వర్ తెలిపారు. తాకట్టు బంగారాన్ని, గోల్డ్‌లోన్‌లో ఉన్న బంగారం పత్రాలను పరిశీలించి, విడిపించి ప్రస్తుత మార్కెట్ రేటుకు కొనుగోలు చేస్తుందని చెప్పారు.
ఈ ప్రక్రియ మొత్తం వినియోగదారుల కళ్ల ముందే పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడించారు. తమ సేవలను వరంగల్‌కు తర్వాత మహబూబాబాద్‌కు విస్తరించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇక్కడ జరిగే ప్రక్రియ అంతా మానవ ప్రమేయం లేకుండా ఖచ్చిత నిర్దారణ కోసం అధునిక యంత్రాలను ఉపయోగిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని వరంగల్ ప్రజలు వినియోగించుకో వాలని కోరారు. కరీంనగర్‌లో తాము చేపట్టిన వినూత్న ప్రక్రియ విజయవం తం కావటంతో వరంగల్ నుంచి విజ్ఞప్తులు వచ్చాయని, అందుకే ఇక్కడా సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు స్పష్టం చేశారు. తమ వాహన సేవలు తెలంగాణలోని అన్ని జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపచేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పా రు. తమ వాహనంలో 24 క్యారెట్ల బంగారు, వెండి నాణేలు గ్రాము నుంచి 20 గ్రాముల వరకు లభిస్తాయని వెల్లడించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాహన సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.