01-08-2025 01:09:29 AM
అభివృద్ధి పనుల పరిశీలనలో కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూర్, జూలై 31 : మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని, పాఠశాలలను, అభివృద్ది పనులను గురువారం కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. చెన్నూర్‌లోని తహశిల్దార్ కార్యాల యాన్ని కలిసి సందర్శించి రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు.
భూభారతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకో వాలని, వివిధ రకాల ధృవపత్రాల కొరకు వచ్చిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి నిర్ణీత గడువులోగా జారీ చేయాలని తహశిల్దార్ మల్లిఖార్జున్‌కు సూచించారు. చెన్నూర్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అమృత్ 2.0 పథకం పనులను మున్సిపల్ కమీషనర్ మురళీకృష్ణతో కలిసి పరిశీలించి పనులను వేగవంతం చేసి త్వర గా పూర్తి చేయాలని కోరారు. మిషన్ భగీరథతో పాటు అమృత్ 2.0 ద్వారా ప్రజలందరికీ నిరంతరం త్రాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పలు గ్రామాల్లో పర్యటన
మండలంలోని కిష్టంపేటలో వన మహోత్సవంలో డీఆర్డీవో కిషన్, ఎంపీడీవో మోహన్ లతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ మొక్కలు నాటారు. పొక్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా 200 మొక్కలు నాటారు. అనంత రం పాఠశాల పరిధిలో ఏర్పాటు చేసిన కిచె న్ గార్డెన్ ను ప్రారంభించారు. పాఠశాలలో ని వంటశాల, విద్యార్థులకు అందించే ఆహా రం నాణ్యత, హాజరు పట్టిక, పరిసరాలను పరిశీలించారు.
విద్యార్థులకు మెనూ ప్రకా రం సకాలంలో నాణ్యమైన, పోషక విలువ లు గల ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని కలెక్టర్ కోరారు. ఆరోగ్య ఉప కేంద్రం కోసం సంబంధిత అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. పల్లెదవాఖానా ఆయుష్ భారత్ ఆరోగ్య కేంద్రా న్ని సందర్శించి మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. అంగ్రాజు పల్లి పీహెచ్సీని పరిశీలించి వైద్యులు, సిబ్బందికి సూచనలు చేశారు.
ఆరోగ్య కేంద్రం పరిధిలోని గర్భిణుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని, సమయానుసారంగా చేసుకోవలసిన పరీక్షలు, తీసుకోవలసిన మందులు, పౌష్టికాహా రంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.