31-08-2025 12:07:31 AM
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి ): సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలు రాష్ట్రంలో కొత్తగా రెండు స్టేషన్లలో ఆగనుంది. రైలు నెం. 20101/ 20102 నాగ్‌పూర్ జంక్షన్ నుంచి బయలుదేరి సేవాగ్రామ్ జంక్షన్, చంద్రాపూర్, బలార్షా, రామగుండం, కాజీపేట జం క్షన్, సికింద్రాబాద్ జంక్షన్ మధ్య నడిచేది. ఇప్పుడు కొత్తగా సిర్పూర్ కాగజ్ నగర్, మం చిర్యాల స్టేషన్లలో సైతం ఆగుతుంది. ఈ రెం డు స్టేషన్లలో వందేభారత్ ఆగడం వల్ల ఉ ద్యోగులు, వ్యాపారులు అటు నాగ్‌పూర్, ఇ టు వరంగల్, హైదరాబాద్ వెళ్లేందుకు ఎంతో సౌకర్యంగా మారనుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.