calender_icon.png 8 September, 2025 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్చ అంటే భయమెందుకు?

31-08-2025 12:09:52 AM

మంత్రి సీతక్క 

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చ అంటే బీఆర్‌ఎస్‌కు భయమెందుకని మంత్రి సీతక్క ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి సీతక్క చిట్‌చాట్ నిర్వ హించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ఆపాలని కోర్టుకు వెళ్లడంలో ఆం తర్యమేంటని నిలదీశారు. 

ఏం చేయాలో తెలయకే బీఆర్‌ఎస్ యూరియా అంశాన్ని నెత్తినెత్తికొని రాజకీయం చేస్తోందని మంత్రి మండి పడ్డారు. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చించకుండా బీఆర్‌ఎస్ అన్నీ ప్రయ త్నాలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు.