నిజామాబాద్ మీదుగా త్వరలో ‘వందేభారత్’

27-04-2024 02:54:05 AM

అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది: ఎంపీ అరవింద్

నిజామాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): నిజామాబాద్ మీదుగా త్వరలోనే వందేభారత్ రైలు ప్రారంభం కానున్నదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో వాకర్స్‌ను కలిసిన ఆయన వారి తో కలిసి ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ గూడ్స్ షెడ్డు ను డిచ్‌పల్లికి మార్చడంతో నిజామాబాద్ కు వచ్చే ప్యాసింజర్ రైళ్ల సంఖ్య పెరిగిందని తెలిపారు.

పార్లమెంట్ నియోజకవ ర్గం అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. ఆర్మూర్. బోధన్ డబ్లింగ్ పనులు పూర్తయితే జిల్లా మీదుగా వెళ్లే రైళ్ల సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ పరిధిలో ఆర్వోబీల పనులు త్వరితగతిన జరుగుతున్నా యని, జిల్లాకు నవోదయ విద్యాలయం కోసం ప్రయత్నిస్తున్నామని అరవింద్ వెల్లడించారు. ఎన్నికల్లో తన విజయం ఖాయ మని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్ మునిసిపల్ ఫ్లోర్‌లీడర్ స్రవంతి రెడ్డి పాల్గొన్నారు.