calender_icon.png 7 November, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్తారు

07-11-2025 12:42:43 PM

  1. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. వికాసం- విధ్వంసానికి మధ్య ఎన్నిక.
  2. కేసీఆర్ పాలనలో వికాసం.. రేవంత్ పాలనలో విధ్వంసం.
  3. రేవంత్ హయాంలో బ్లాక్ మెయిల్ పాలన.

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. వికాసం-విధ్వంసానికి మధ్య ఎన్నిక అని మాజీ మంత్రి, సిద్దిపేట పేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao)  సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో అన్నారు. వికాసం గెలవాలా? విధ్వంసం గెలవాలో? ప్రజలే నిర్ణయించుకోవాలని హరీశ్ రావు సూచించారు. హైడ్రా పేరిట జరుగుతున్న అరాచకాలు ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. రెండేళ్ల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనలో అరాచకాలు జరిగాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని హరీశ్ రావు జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఓడించకపోతే మరో మూడేళ్లు నరక యాతన అనుభవించాలని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో వికాసం.. రేవంత్ రెడ్డి పాలనలో విధ్వంసం అన్నారు. కేసీఆర్ అందించిన పథకాలు ఒక్కొక్కటీ రద్దవుతున్నాయని హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి హయాంలో బ్లాక్ మెయిల్ పాలన జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

పారిశ్రామికవేత్తలను రేవంత్ రెడ్డి ఎలా బ్లాక్ మెయిల్ చేశారో అందరికీ తెలుసన్నారు. కళాశాలలు నడపలేకపోతున్నామని యాజమాన్యాలు నిరవధిక సమ్మెకు దిగారని చెప్పిన ఆయన నిరవధిక సమ్మెకు దిగిన కళాశాలల్లో విజిలెన్స్ సోదాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బకాయిలు విడుదల చేయక.. సమ్మె చేయనీయకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేయకపోతే సమ్మె నోటీసు ఇచ్చారు. సమ్మె నోటీసు ఇస్తే ఆస్పత్రులకు నోటీసులు.. మున్సిపల్, విజిలెన్స్ దాడులు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యకపోతే పథకాలు ఆపేస్తామన్న రేవంత్ రెడ్డికి హరీశ్ రావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పథకాలు ఆపేస్తామనడానికి రేవంత్ రెడ్డి అయ్య జాగీరా? అన్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లో నుండి డబ్బులు ఇస్తున్నాడా? ఆయన నాయన డబ్బులు ఇస్తున్నాడా? అని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తున్నారు.. అది ప్రభుత్వం బాధ్యతని సూచించారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్న హరీశ్ రావు అందుకే ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్దారు.