07-11-2025 10:27:43 PM
భూత్పూర్: మున్సిపాలిటీ కేంద్రంలోని స్వామి వివేకానంద విద్యాలయంలో శుక్రవారం వందేమాతరం గేయం రూపొందించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు 150వ ఆకారంలో కూర్చుని, జాతీయ పతాకాలను చేభూని సామూహికంగా వందేమాతరం ఆలపించారు.
ఈ సందర్భంగా వందేమాతరం గేయ రచయిత బంకింగ్ చంద్ర చటర్జీ జీవిత విశేషాలతో పాటు వందేమాతరం గేయ రచనకు దారి తీసిన అంశాలు... ఈ గేయము ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర పోరాటంలో దేశభక్తి భావాలను పెంపొందించిన వివరాలు తదితరాలను గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవిచంద్ర, శివకుమార్, సాహితి, శిరీష, శివరాణి, సింధు , చైతన్య తదితరులు పాల్గొన్నారు.