07-11-2025 10:30:17 PM
స్నేహితుడి పెళ్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదం
మూసాపేట: మండలం వేముల గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ తోటి స్నేహితుడు తుంకిల్ పురం గ్రామ పంచాయతీ కార్యదర్శి పెళ్లి కి వెళ్లి తిరుగు ప్రయాణంలో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తన స్నేహితుడు గద్వాల్ లో ఉండగా పెళ్లి చూసుకోని తిరుగు ప్రయాణంలో కొత్తకోట మండలం పాలెం దగ్గర సాయంత్రం 6 గంటల సమయంలో టాయిలెట్ చేద్దామని కారు సైడ్ కి ఆపుకోగా వెనక నుంచి అతివేగంగా వస్తున్న పత్తి గింజల లారీ అకస్మాత్తుగా లారీ కారుపై పడగా అందులో ప్రయాణిస్తున్న నలుగురు స్నేహితులు ముగ్గురు సురక్షితంగా బయట పడ్డారు. నాలుగవ వ్యక్తి సతీష్ రెడ్డి డ్రైవింగ్ సీట్లో నుంచి బయటకు రావడానికి వీలుకాక అదే సీట్లో ఇరుక్కుపోయి బయటికి రాలేకపోయారు. ప్రమాదం జరిగిందని తెలుసుకొని హుటా హుటినా ఎల్ ఎన్ టి రోడ్డు సిబ్బంది, పోలీస్ సిబ్బంది జెసిబిల, క్రేన్ సహాయంతో 45 నిమిషాలు చర్యలు కొనసాగించి బయటికి తీసి వెంటనే అంబులెన్స్ ద్వారా మహబూబ్నగర్ ఎస్వీఎస్ హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో తుది శ్వాస విడిచారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.