calender_icon.png 8 November, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఇబ్బందులు రానివ్వని సర్కార్

07-11-2025 10:25:37 PM

ముందస్తుగా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం 

మండల సింగిల్ విండో చైర్మన్ జి శ్రీనివాస్ రెడ్డి

కోయిల్ కొండ: రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని సంకల్పంతో ప్రభుత్వము ముందస్తుగానే వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని మండల సింగిల్ విండో చైర్మన్ జి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పారుపల్లి, కొత్లాబాద్, చంద్రస్పల్లి,అనంతపూర్ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతులు ధాన్యాన్ని వరి గొనుగులు కేంద్రాల్లో విక్రయించి అత్యధికంగా లబ్ధి పొందాలని సూచించారు. ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని గన్ని బ్యాగులను సైతం అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీవో ధనుంజయ్ గౌడ్ ఏపీఓ నర్సయ్య మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జీంగం రవి, విద్యాసాగర్ గౌడ్ తదితరులు ఉన్నారు.