calender_icon.png 22 September, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలరించిన వాసవి మాత ఉత్సవ విగ్రహ శోభాయాత్ర

22-09-2025 05:44:07 PM

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో 55వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సవ విగ్రహ శోభాయాత్ర సోమవారం ఘనంగా నిర్వహించారు. కోలాటాలు, చెక్కభజనలు, సాంప్రదాయ నృత్యాలతో పట్టణ పురవీధుల గుండా చేపట్టిన శోభాయాత్ర చూపరులను ఆకట్టుకుంది. మార్కెట్ శివాలయం నుండి సాయి బాలాజీ సిండికేట్, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కమిటీ అధ్యక్షులు మాచిపెద్ది శివకుమార్ శోభాయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రధాన రహదారి గుండా సాగిన ఈ యాత్ర వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకుంది. అలయ అర్చకులు జోషి పాండురంగ శర్మ ద్వాజారోహణం, గోపూజ, గణపతి పూజతో పాటు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ ఆర్యవైశ్య సిండికేట్ సభ్యులు పాల్గొన్నారు.