22-09-2025 07:55:55 PM
భద్రాచలం,(విజయక్రాంతి): యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ రైతు విభాగంలో భద్రాచలం చెందిన ఓటు రంగారావును ఎంపిక చేసి సన్మానం చేయడం పట్ల భద్రాచలంలో ఐటిసి సిఎన్టియుసి మిత్రపక్షాలు రైతు సోదరుల ఆధ్వర్యంలో సోమవారం సన్మానించారు. టిఎన్టియుసి, ఐటిసి అధ్యక్షులు కనకమెడల హరిప్రసాద్ ఆధ్వర్యంలో భద్రాచలం కమ్మవారి సత్రంలో ఏర్పాటు చేసిన ఈ సన్మాన సభకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆదర్శ రైతు పోటు రంగారావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ అధికారి చెంగల్ రావు, పట్టణ ప్రముఖులు పాకాల దుర్గాప్రసాద్ రామారావు వీరయ్య చల్లగొండ నాగేశ్వరరావు, పి సత్యనారాయణ సైతం పాల్గొని సన్మానించారు. గతంలో కార్మిక నాయకుడిగా శ్రమశక్తి అవార్డు పొందటమే కాకుండా ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ రైతు అవార్డును ఉండటం ఒక్క రంగారావుకే చెందిందని పలువురు వక్తలు కొనియాడారు.