calender_icon.png 22 September, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా బతుకులు ఇంతేనా...?

22-09-2025 07:41:33 PM

కలెక్టరేట్ కు తరలివచ్చిన కన్నపూర్ గ్రామస్తులు..

భారీ వర్షాలకు ముంపుకు గురి కావడంతో తీవ్ర నష్టం..

తమ గ్రామానికి ఎవరు రాలేదని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు.. 

కామారెడ్డి (విజయక్రాంతి): భారీ వర్షాలతో తమ గ్రామ ముంపుకు గురై తీవ్రంగా నష్టపోయామని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ తరలివచ్చారు. తమను పట్టించుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గ్రామం పూర్తిగా ముంపుకు గురైందని తెలిపారు. అధికారులు రాలేదు, ప్రజా ప్రతినిధులు రాలేదు స్థానిక ఎమ్మెల్యే సైతం తమ గ్రామాన్ని ఇంతవరకు సందర్శించలేదని కన్నాపూర్ గ్రామ మహిళలు కలెక్టరేట్ తరలివచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తమ బతుకులు ఇంతేనా అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. కలెక్టర్ సారు తమ గ్రామంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఇప్పించాలని కన్నాపూర్ మహిళలు కలెక్టరేట్లో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదు చేశారు. గ్రామానికి అధికారులను పంపించి నష్టం వివరాలను సేకరిస్తామని కలెక్టర్ ఆశిష్ సంగువాన్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కన్నాపూర్ గ్రామం పై ఎమ్మెల్యేకు ఎందుకు వివక్ష వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా గ్రామాన్ని సందర్శించి నష్ట పోయిన బాధితుల ను ఆదుకోవాలని కోరారు.