calender_icon.png 22 September, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యం వికటించి చిన్నారి మృతి

22-09-2025 08:07:02 PM

ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ దేవేందర్ నగర్ కు చెందిన హాసిన(06) అనే బాలిక మృతి చెందిన  ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... బోడుప్పల్ దేవేందర్ నగర్ లో నివసించే కొండ రాజు లావణ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్దకూతురు హసీన ,రాజు పెయింటర్ గా పనిచేస్తున్నాడు.  తల్లి లావణ్య వాచ్ మెన్ గా పని  చేస్తుంది. గత వారం రోజులుగా చిన్నారి హాసిని జ్వరం బలహీనత వంటి లక్షణాలు కనిపించడంతో ఇటీవల పరీక్షలు చేయించుకోగా జాన్డీస్, డెంగ్యూ  పాజిటివ్ అని తేలింది.ఈ  ఆదివారం  మధ్యాహ్నం జ్వరం మరింత  పెరగడంతో బోడుప్పల్ లోని సత్య పాలి క్లినిక్ లో వైద్యం కోసం చేర్పించారు. పరిస్థితి  క్షీణించి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినది.  స్థానిక వైద్యుడు సరిగా స్పందించలేదని తెలిసి తెలియని చికిత్స చేస్తూ చిన్నారి ప్రాణాన్ని బలిగొన్నడంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు సమాచారం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.