22-09-2025 05:46:02 PM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్,(విజయక్రాంతి): సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియెజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) కింద మంజూరైన 246 లబ్ధిదారులకు 86 లక్షలు విలువైన చెక్కులనుఆయన పంపిణీచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగంచేసుకోవాలన్నారు. ఆపదలో ఉన్న పేద ప్రజలకు అండగా సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.