22-09-2025 07:58:22 PM
ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని మండల బిఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో రేగా క్రికెట్ టోర్నీని సోమవారం స్థానిక తహసిల్దార్ చదలవాడ అనుష మాజీ ఎంపీపీ మంజు భార్గవి, మాజీ జెడ్పిటిసి కొమరం హనుమంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత క్రీడల పట్ల ఆసక్తి కనపరచాలని తద్వారా మానసికల్లాసం శరీర దారుణ్యం పెంపొందుతుందన్నారు. క్రీడల ద్వారా యువతలో స్నేహ సంబంధాలు మెరుగుపడతాయని తద్వారా యువత సన్మార్గంలో నడవడానికి దోహదపడుతుందన్నారు. ఈ టోర్నమెంట్లో మూడు మండలాల క్రీడాకారులు పాల్గొననున్నారని ఈ క్రికెట్ టోనీలో గెలుపొందిన విజేతలకి మొదటి బహుమతి రూ 20 వేలు షీల్డ్ రెండో బహుమతి రూ 11 వేలు ,షీల్డ్ అందించడం జరుగుతుందన్నారు. ఈ టోర్నీని నిర్వహించే మేనేజ్మెంట్ వారికి సహకరిస్తూ ఈ క్రీడల్లో పాల్గొనాలన్నారు. ఈ సందర్భంగా ఈ టోర్నీ ఏర్పాటు చేసిన యూత్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.