22-09-2025 07:45:21 PM
తాండూరు (విజయక్రాంతి): బస్సులో మరిచిపోయిన విలువైన కవర్ను తిరిగి ప్రయాణికుడికి అప్పగించి బస్సు కండక్టర్ నిజాయితీ చాటుకున్న ఘటన సోమవారం పట్టణంలో జరిగింది. బాధితులు రాజు(జర్నలిస్ట్) తెలిపిన వివరాల ప్రకారం సలబత్తాపూర్ బంటువారం వైపు నుండి తాండూర్ వెళ్లే బస్సులో ప్రయాణిస్తూ తాండూరు బస్టాండ్ లో తన నూతన వస్త్రాలు, ఫోను చార్జర్ ఉన్న కవర్ ని మరచిపోయాడు. కొద్ది దూరం వెళ్ళాక కవర్ గుర్తుకొచ్చి బస్సు డిపోలో వెళ్లి కవర్ కోసం వాకాబు చేశాడు. కండక్టర్ బాలరాజు కవర్ తన వద్దే ఉందని రాజుకి కవర్ అప్పగించాడు. నిజాయితీ చాటుకుని బస్సు కండక్టర్ బాలరాజు విలువైన కవర్ తిరిగి ఇవ్వడం తో రాజు కృతజ్ఞతలు తెలిపాడు.