వాహనాల తనిఖీలు ముమ్మరం

27-04-2024 01:00:28 AM

రూ. 9.28లక్షలు పట్టివేత

జహీరాబాద్, ఏప్రిల్  26 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో శుక్రవారం చేపట్టిన వాహనాల తనిఖీలో రూ. 9.28లక్షల నగ దును పోలీసులు పట్డుకున్నారు. నామినేషన్లు ముగిసిన తర్వాత సబ్ డివిజన్ పరిధిలోని చెక్ పోస్టులు, ప్రధాన రోడ్డు మార్గాల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి తెలంగాణలోకి వస్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తుండగా భారీగా నగ దు పట్టుబడింది. జహీరాబాద్ పట్టణంలో చేపట్టిన తనిఖీలో రూ. 4.50లక్షలు, మాడ్గి అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద రూ. 70వేలు, హుస్సేల్లి చెక్‌పోస్టు వద్ద రూ. 1.98 లక్షలు, కోహీర్ రైల్వే గేట్ వద్ద రూ. 2.10 లక్షలు నగదును పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన నగదుకు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో జహీరాబాద్ పట్టణ ఎస్సై లక్ష్మారెడ్డి, చిరాగ్ పల్లి ఎస్సై నరేశ్, కోహీర్ ఎస్సై విఠల్, హద్నూర్ ఎస్సై రామనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.