calender_icon.png 8 August, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమానుబంధాలను పంచుకునే పండుగ రక్షాబంధన్

08-08-2025 06:20:25 PM

ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు..

చండూరు (విజయక్రాంతి): అన్నా చెల్లెలు.. అక్క తమ్ముళ్ల ప్రేమానుబంధాలతో పంచుకునే పండుగ రక్షాబంధన్ అని ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు(Trasma District President Kodi Srinivasulu) అన్నారు. శుక్రవారం స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు రాఖీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గాంధీజీ విద్యార్థులు రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనుబంధాలను పంచుకునే పండుగ రక్షాబంధన్ అని, రాఖీ పండుగ నాడు సోదరీమణులు తమ సోదరులకు చేతికి రాఖీ కట్టి, ఆశీర్వాదం పొందుతారని, తన చెల్లి లేదా అక్కకు సోదరులు మంచి గిఫ్ట్ ఇస్తారని ఆయన అన్నారు.

ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని పిలుస్తారని ఆయన అన్నారు. అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి రాఖీ పర్వదినమని, హిందువుల పండుగలలో రాఖీ ముఖ్యమైన పండుగని ఆయన అన్నారు. భారతదేశంలోని రాఖీ పండుగ చాలా ఇష్టమైన పండుగని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్స్ భార్గవ్, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.