calender_icon.png 4 January, 2026 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిపక్షంలో ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా

03-01-2026 03:04:59 PM

హైదరాబాద్: గతంలో ముఖ్యమంత్రి పీపీటీ ఇస్తే.. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీకి రాలేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Former Minister Vemula Prashanth Reddy) తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. పీపీటీ పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధమని కాంగ్రెస్ నేతలు(Congress leaders) అన్నారని గుర్తుచేశారు. పీపీటీ పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధమని కాంగ్రెస్ నేతలు లేఖ రాశారు. నాడు రాసిన లేఖలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పద్మావతి సంతకాలు చేశారని చెప్పారు. ఇప్పుడేమో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంలోఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి ఉత్తమ్ పీపీటీ ఇస్తే.. మాకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు.బీఆర్ఎస్ కు పీపీటీ అవకాశం ఇవ్వాలని కోరితే.. బీఏసీలో తిరస్కరించారని వివరించారు.