calender_icon.png 4 January, 2026 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్రిక్తతకు దారి తీసిన బీఆర్ఎస్ శ్రేణుల నిరసన

03-01-2026 02:50:29 PM

మాజీ మంత్రిని స్టేషన్ కు తరలించిన పోలీసులు... 

ఆదిలాబాద్, (విజయక్రాంతి): సోయా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. శనివారం మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు వచ్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. మాజీ మంత్రిని పోలీసులు బలవంతంగా  స్టేషన్ కు తరలించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.  ఐతే పోలీసుల తీరును నిరసిస్తూ మాజీ మంత్రి జోగు రామన్న స్టేషన్ ఆవరణలోనే కింద పడుకొని నిరసన వ్యక్తం చేశారు. .