calender_icon.png 5 January, 2026 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వాయర్ ఏర్పాటులో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలం

04-01-2026 09:32:03 AM

తుంగతుర్తి ఏరియా దవాఖాన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్.

తుంగతుర్తి: రుద్రమ్మ చెరువును రిజర్వాయర్ గా మార్చడంలో నాటి బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా, మొదట అర్వపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను, తుంగతుర్తి లోని రుద్రమ్మ చెరువు పరివాహక ప్రాంతం, తుంగతుర్తి ఏరియా దవాఖాన నిర్మాణ పనులు  పరిశీలించి, మాట్లాడారు.  కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను పరిశీలించి వర్షాకాలం వస్తే పూర్తిస్థాయిలో నీటితో మునిగిపోతుందని, పరిసర ప్రాంతాలు మురుగునీరు చేరి విద్యార్థుల రోగాల బారిన పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ చుట్టపు చూపుగా వచ్చి, సమస్యలను మర్చిపోయారని విమర్శించారు.

గడచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ మంత్రి, హరీష్ రావు సైతం ఈ చెరువును పరిశీలించి, రిజర్వాయర్గా మార్తానని హామీ ఇచ్చి వెళ్లిపోయినట్లు గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎస్సారెస్పీ69,70 డిబిఎంల కాలువల మరమ్మత్తులు చేయకపోగా, రిజర్వాయర్ గా మార్చుటకు కనీస ప్రయత్నాలు, ల్యాండ్ కొటేషన్ కూడా కనీసం చేయకపోవడం దురదృష్టకరమైన విషయం అన్నారు. రుద్రమ చెరువును కనీసం 2 టీఎంసీ రిజర్వాయర్ గా మార్చినట్లయితే వేలఎకరాలు రైతులకు సాగులోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం తుంగతుర్తి ప్రభుత్వ దాకా నాను సందర్శించి ఒక ప్రక్క సిబ్బంది మరొక ప్రక్క రోగులతో మమేకమై, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రములను 156 ప్రభుత్వ దవాఖానాలో ఔట్సోర్సింగ్ సిబ్బందిని తగ్గించినట్లు, జీవో విడుదల చేసిందని దీని తక్షణమే రద్దుచేసి, ఔట్సోర్సింగ్ కొరత లేకుండా, ప్రతినెల జీతభత్యాల అంది విధంగా కృషి చేయాలని కోరారు. నూతనంగా నిర్మిస్తున్న100 పడకల దవాఖాన్ని స్వయంగా వెళ్లి పరిశీలించారు. రెండు సంవత్సరాలు గడుస్తున్న నేటికి పనులు పూర్తి కాకపోవడం పై ఆరాధిసి, సంబంధిత కాంట్రాక్టర్కు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి, నిర్మాణ పనులు వేగవంతంగా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.