calender_icon.png 5 January, 2026 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజ్ఞాన విహార యాత్రకు విరాళం

04-01-2026 09:33:55 AM

జెడ్ పి హెచ్ ఎస్  విద్యార్థులకు జడ్పీటీసీ మహేష్ గుప్తా సహాయం

శివ్వంపేట,(విజయక్రాంతి): శివ్వంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో(Shivampet Zilla Parishad High School) చదువుతున్న విద్యార్థులు విజ్ఞాన విహార యాత్రలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని హాంపి, గోకర్ణ ప్రాంతాలకు బయలుదేరుతున్న సందర్భంగా వారి ప్రయాణ వ్యయాలకు తోడ్పాటుగా శివ్వంపేట తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పది వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని గ్రామ సర్పంచ్ రాజపేట వెంకటేశ్వర్ చేతుల మీదుగా పాఠశాల ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ గుప్తా మాట్లాడుతూ, పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన ద్వారా విద్యార్థుల్లో విస్తృత అవగాహన ఏర్పడుతుందని తెలిపారు.

హాంపి వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన చారిత్రక కట్టడాలు విద్యార్థులకు భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని పరిచయం చేస్తాయని, గోకర్ణ దర్శనం ఆధ్యాత్మిక విలువలనుపెంపొందిస్తుందని పేర్కొన్నారు. సర్పంచ్ రాజపేట వెంకటేశ్వర్ మాట్లాడుతూ, విద్యే గ్రామాభివృద్ధికి పునాది అని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ సహకారం విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. .విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, తమ పిల్లలకు విజ్ఞాన విహార యాత్ర ఎంతో ఉపయోగకరమని, ఆర్థిక సహాయం అందించిన జడ్పీటీసీ మహేష్ గుప్తాకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఈ యాత్ర ద్వారా చరిత్ర, సంస్కృతి, ప్రకృతి విశేషాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ ఇసుగారి మల్లేష్, వార్డు సభ్యులు కొడకంచి గణేష్ గౌడ్, కమలయ్య గారి నర్సింలు, పెద్దకోళ్ల విక్రం, వర్గంటి రమేష్, సేటు బి ఆంజనేయ నాగరాజు అలాగే గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.