04-01-2026 10:05:58 AM
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone tapping case) కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు(MLC Naveen Rao) సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని నోటీసులు పేర్కొంది. జూబ్లీహిల్స్ పీఎస్ లో నవీన్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. ఒక డివైజ్ తో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నవీన్ రావుపై ఆరోపణలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేతల విచారణ కీలకంగా మారింది. త్వరలో బీఆర్ఎస్ కీలక నేతలను కూడా విచారించే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.