08-07-2025 12:00:00 AM
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజాచిత్రం ‘కింగ్‌డమ్’. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానా యిక కాగా, సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషిస్తు న్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా ను సూర్య దేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తు న్నారు.
మొద ట్నుంచీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ మరింత బజ్ క్రియేట్ చేసింది. ఇదివరకే విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్ అని వార్య కారణాల వల్ల వాయిదా వేశారు. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రక టించారు. జూలై 31న ప్రపంచ వ్యాప్తం గా విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఈ మేర కు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రోమోను విడుదల చేశారు. యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగాలు, విజువ ల్స్‌తో ఉన్న ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రా నికి సంగీతం: అనిరుధ్ రవిచందర్; డీవోపీ: జోమో న్ టీ జాన్ ఐఎస్‌సీ, గిరీష్ గంగాధరన్ ఐఎస్‌సీ; ఎడిటర్: నవీన్ నూలి.