25-10-2025 07:08:37 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): మూడు నెలలు దాటిన ప్రతి పశువుకి గాలికుంటు వ్యాధి టీకాలు ఇప్పించాలని అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి, కాళోజి వాడి గ్రామాలలో శనివారం పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు తమ పశువులకు ఖచ్చితంగా గాలికుంటు వ్యాధి టీకాలు ఇప్పించుకోవాలని సూచించారు. గాలికుంటు వ్యాధి సోకితే పశువుల పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా 60 ఆవులకు 348 గేదెలకు టీకాలు అందించారు.