calender_icon.png 26 October, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల 27న ఎ4 మద్యం దుకాణాల కేటాయింపు

25-10-2025 07:07:48 PM

జిల్లా ఆబ్కారీ, మధ్య నిషేధశాఖ అధికారి నందగోపాల్..

మంచిర్యాల (విజయక్రాంతి): నూతన మద్యం పాలసీ విధానం 2025-27లో భాగంగా ఈ నెల 27న ఉదయం 10 గంటలకు నస్పూర్ మండలం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పివిఆర్ గార్డెన్స్ లో ఎ4 మద్యం దుకాణాలకు కేటాయింపు జరుగుతుందని జిల్లా ఆబ్కారీ, మధ్య నిషేధశాఖ అధికారి నందగోపాల్ శనివారం తెలిపారు. గార్డెన్స్ లో ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. దరఖాస్తుదారులు సకాలంలో కార్యక్రమానికి హాజరు కావాలని తెలిపారు. లక్కీ డ్రా పద్ధతిలో దుకాణాలు కేటాయించడం జరుగుతుందన్నారు.